Header Ads Widget

papavinasanam tirumala history in telugu

papavinasanam tirumala history in telugu

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది . శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది. ఈ తీర్థం స్నానం వద్ద చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం . ఆకాశ గంగలో స్నానం ఆచరిస్తే పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.


papanasam place tirumala tirupathi video :  



పాపవినాశన తీర్థం స్థల పురాణం : 


తిరుమల తిరుపతి దేవస్థానములు : తిరుపతి


శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం - పాపవినాశన తీర్థం


తిరుమలలోని పరమ ప్రసిద్ధిగావించిన పుణ్యతీర్థములలో పాపవినాశనం తీర్థం ఒకటిగా వెలసియున్నది. ఈతీర్థంలో స్నానమాచరించిన సకల పాపములు నశించి, సకల కోరికలు సిద్ధించి సుఖశాంతి ప్రాప్తించును. కావున ఈ తీర్థంమునకు ఈ నామము ఏర్పడినదని శ్రీ వెంకటాచల పురాణంలో పేర్కొనబడినది అశ్వయుజమాసమునందు శుక్ల పక్ష సప్తమి ఉత్తరాషాడ నక్షత్రయుక్త ఆదివారం కాని లేక ఉత్తరాభాద్ర నక్షత్రముతో కూడిన ద్వాదశి దినము గాని, తీర్థ విశేష దినముగా పాపవినాశనం గురించి స్కంధ పురాణంలో “చెప్పబడినది ఇక్కడ క్షేత్ర దేవతలు శ్రీగంగాదేవి మరియు శ్రీ ఆంజనేయస్వామి వారు. తిరుమల తిరుపతి  దేవస్థానం ఆధ్వర్యములో పాపవినాశనం డ్యామ్ వద్ద శ్రీ గంగాదేవి అమ్మవారి విగ్రహము 02-05-1986 లో ప్రతిష్ఠంచబడినది. తదుపరి. పాత ఆలయ స్థానములో శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయమును నూతన రాతి కట్టడముతో నిర్మించి 18-01-2013 లో మహా సంప్రోక్షణ కార్యక్రమముతో పునరుద్ధరించడమైనది.


papavinasanam tirumala history in telugu



Post a Comment

0 Comments