Header Ads Widget

Ctet notification 2024 in telugu | Ctet notification 2024 in telugu syllabus

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా సీటెట్! ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో.. ఉపాధ్యాయ పోస్ట్లకు పోటీ పడే అర్హత లభిస్తుంది. బీఈడీ, డీఈడీ తదితర ఉపాధ్యాయ విద్య కోర్సుల ఉత్తీర్ణులు సీటెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల సీటెట్ జనవరి-2024 నోటిఫికేషన్ వెలువడింది. పరీక్షను జనవరి 21న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. సీటెట్-2024 వివరాలు, పరీక్ష విధానం.....


✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)



అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.



✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)



అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.



దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.


పరీక్ష విధానం..


పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.



పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.



ముఖ్య సమాచారం :


దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.  


ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23, 2023


సీటెట్ పరీక్ష తేదీ: 2024, జనవరి 21


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.


Official website : https://ctet.nic.in


Ctet notification 2024 in telugu syllabus pdf :



ఈ గ్రూప్ విద్య మరియు సంబంధిత అంశాలపై దృష్టి పెడుతుంది. UPSC APPSC TSPSC JL DL SI కానిస్టేబుల్ Railway TET DSC SLET SET NET మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి  చాలా ఉపయోగకరంగా వుంటుంది.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



      


Post a Comment

0 Comments