Header Ads Widget

Indian Polity Bits in Telugu | 1000 plus questions on Indian Polity pdf in Telugu

 

Indian Polity Bits in Telugu | 1000 plus questions on Indian Polity pdf in Telugu


•MCQs Questions -భారత రాజ్యాంగ చారిత్రక నేపధ్యం, ముఖ్య చట్టాలు :


•ప్రతి ప్రశ్నకు వివరణత్మకమైన సమాధానం ఇవ్వడమైనది


1. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది ?

(A) అమెరికా

(B) బ్రిటన్

(C) ఇండియా

(D) ఆస్ట్రేలియా


SHOW ANSWER

[Ans: b]

Explanation: ప్రపంచంలో "బ్రిటన్ రాజ్యంగమును" తోలి రాజ్యంగ చట్టంగా భావిస్తారు


2.ప్రపంచంలో తోలి లిఖిత రాజ్యంగం ఏది ?

(A) అమెరికా

(B) బ్రిటన్

(C) ఇండియా

(D) ఆస్ట్రేలియా


SHOW ANSWER

[Ans: a]

Explanation: ప్రపంచంలో అమెరికా రాజ్యంగం తొలి లిఖిత రాజ్యంగంగా భావిస్తారు.


3.భారత దేశంలో తొలి రాజ్యంగ చట్టం ఏది?

(A) 1950 చట్టం

(B) 1861 చట్టం

(C) 1773 చట్టం

(D) 1784 చట్టం


SHOW ANSWER

[Ans: c]

Explanation: భారత దేశానికి వ్యాపారరిత్య వచ్చిన ఈస్ట్ండియా కంపెనీ వ్యవహారాలను నియత్రించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టమును రూపోదించారు. ఇది భారత దేశానికి సంబందించిన మొదటి లిఖితచట్టంగా పేర్కోంటారు.


4.గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఎర్పర్చారు?

(A) 1909 మింటో మార్లే చట్టం

(B) 1919 మాంటెగ్ చెమ్స్ పర్డ్ చట్టం

(C) 1861 కౌన్సిల్ చట్టం

(D) 1773 రెగ్యులేటంగ్ చట్టం


SHOW ANSWER

[Ans: d]

Explanation: బెంగాల్ గవర్నర్ యొక్క హొదాను "గవర్నర్ జనరల్ అఫ్ బెంగాల్" గా మార్చిన చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం.


5.కలకత్తాలో ఫెడరల్ కోర్ట్ /సూప్రీంకోర్టు ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

(A) 1784 చట్టం

(B) 1773 రెగ్యులేటంగ్ చట్టం

(C) 1833 బార్టర్ చట్టం

(D) 1813 బార్టర్ చట్టం


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1773 ద్వారా Fedaral court ను ఏర్పాటు చేశారు. ఇందులో 1 ప్రదాన న్యయముర్తి 3 సా న్యాయముర్తులు ఉంటారు (1+3)


6.భారతదేశంలో " బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను" ఏర్పాటు చేసిన చట్టం ఏది?

(A) 1773 రెగ్యులేటంగ్ చట్టం

(B) 1784 పిట్ ఇండియా చట్టం

(C) 1793 చార్టర్ చట్టం

(D) 1813 చార్టర్ చట్టం


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1784 పిట్ ఇండియా చట్టమును అనుసరించి రాజకీయ వ్యవహరాలను చూడటానికి board of control ను ఏర్పాటు చేశారు.


7.దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది

(A) 1773 రెగ్యులేటంగ్ చట్టం

(B) 1753 చార్టర్ చట్టం

(C) 1784 పిట్ ఇండియా చట్టం

(D) 1813 చార్టర్ చట్టం


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1784 పిట్ ఇండియా చట్టంను అనుసరించి భారతదేశంలోని పరిపాలనా అంశాలను రెండురకాలుగా విభజించారు. 1) రాజకీయ వ్యవహారలను నియంత్రించడానికి board of control ను 2) వ్యాపార వ్యవహారాలను నియంత్రించడానికి court of directors ను ఏర్పాటు చేశారు. పైవిదంగా ఈస్ట్ండియా కంపెనీ పాలనలో ద్వంద్వ ప్రభుత్వంను ప్రవేశపెట్టారు.


8.ఏ చట్టం ద్వారా " ఈస్టిండియ కంపెనీ వ్యాపార గుత్తాదికారమును" రద్దు చేశారు.

(A) 1813 చార్టర్ చట్టం

(B) 1833 చార్టర్ చట్టం

(C) 1793 చార్టర్ చట్టం

(D) 1853 చార్టర్ చట్టం


SHOW ANSWER

[Ans: a]

Explanation: 1913 చార్టర్ చట్టం ఈస్టిండియ కంపెనీ వ్యాపార గుత్తాదికారమును రద్దు చేస్తూ, బ్రిటీష్ పౌరులందరికి వ్యాపారం చేసే స్వేచ్చను అందించారు.


9.ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు.

(A) 1833

(B) 1813

(C) 1861

(D) 1858


SHOW ANSWER

[Ans: a]

Explanation: 1833 చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ గా వ్యవహరించబడింది. మొదటి గవర్నర్ జనరల్ : విలియం బెంటిక్


10.కింది వాటిలో మొదటి సంఘటన?

(A) సివిల్ సర్వీస్ రంగంలో పోటి పరిక్ష విధానం

(B) సంపూర్ణ స్వేచ్చా వాణిజ్య విదానం

(C) భారత రాజ్యకార్యదర్శి పదవి ఏర్పాటు

(D) ఈస్టిండియా కంపనీ పరిపాలన రద్దు


SHOW ANSWER

[Ans: b]

Explanation: A-1854 సం. B-1813 సం. C-1858 సం. D-1858. కావున సంపూర్ణ స్వేచ్చా వాణిజ్య విదానం మొదటి సంఘటనగా చేప్పవచ్చు.


11.భారతీయ "లా" కమిషన్ ఏర్పడిన సం.

(A) 1813 సం.

(B) 1833 సం.

(C) 1853 సం.

(D) 1858 సం.


SHOW ANSWER

[Ans: b]

Explanation: భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి 1833 లో భారతీయ "లా" కమీషన్ ఏర్పాటు చేశారు.


12.ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వోద్యాగానికి అందరు అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది?

(A) 1813 చట్టం

(B) 1773 Regulating act

(C) 1833 చార్టార్ చట్టం

(D) 1784 పిట్ ఇండియా చట్టం


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1833 చట్టాన్ని అనుసరించి ఈస్టీండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశాన్ని కల్పంచారు. ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి వివక్షను రద్దు చేశారు.


13.1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాలలో ఈ క్రింది వాటిలో ఒకటి లేదు.

(A) ఈస్టిండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం

(B) కౌన్సిల్ లోని ఉన్నతాదికారిని గవర్నర్ జనరల్ గా మార్చడం

(C) కౌన్సిల్ న్యాయ చట్టాలకు చేసే అదికారం గవర్నర్ జనరల్ కు ఇవ్వబడింది

(D) గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోని న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు


SHOW ANSWER

[Ans: d]


14.బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చాట్టం ద్వారా వైశ్రాయి అదిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ పోలియో విదానం ద్వారా నెలకొల్పారు?

(A) 1861 కౌన్సిల్ చట్టం

(B) 1885 భారతప్రభుత్వ చట్టం

(C) 1892 కౌన్సిల్ చట్టం

(D) 1909 కౌన్సిల్ చట్టం


SHOW ANSWER

[Ans: a]

Explanation: 1859 లో ప్రవేశపెట్టిన పోర్ట్ పోలియో విదానానికి లార్డ్ కానింగ్ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్ట బద్దత కల్పించారు.


15.బ్రిటీష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఏప్పుడు స్వీకరించింది?

(A) 1833

(B) 1853

(C) 1858

(D) 1909


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 లో ఇంగ్లాడ్ విక్టోరియా మహారాణి చేసిన ప్రకటన ద్వారా భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికి పరిపాలనను స్వయంగా భ్రిటీష్ ప్రభుత్వమే స్వీకరించిది.


16.భారతీయ రాష్టాంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా ఛేసిన చట్టం ?

(A) 1813

(B) 1833

(C) 1853

(D) 1861


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1853 చట్టం ద్వారా కేద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. దేశం మొత్తానికి వర్తించే శాసనాలు జేసే అదికారం ఈ కౌన్సిల్ కు కల్పించారు.


17.భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?

(A) 1892 కౌన్సిల్ చట్టం

(B) భారత ప్రభుత్వ చట్టం 1919

(C) భారత ప్రభుత్వ చట్టం 1935

(D) భారత ప్రభుత్వ చట్టం 1909


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1919 మాంటింగ్ చెమ్స్ పర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమీషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. 1921లో ఏర్పడిన " లీ కమిషన్" సూచనలను అనుసరించి 1926 లో కేంద్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాటు చేశారు.


18.1919 చట్టంలోని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించిన వాఖ్యాల్లో సరైంది?

(A) రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాద్యత వహిస్తారు

(B) బాద్యతాయుత ప్రభుత్వం దిశలో ఇది ముందడుగు

(C) ప్రభుత్వానికి నామమాత్ర అధిపతి ఉంటారు

(D) ఏదికాదు


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1919 చట్టం ద్వారా రాష్ట్రప్రభుత్వ అదికారులను రిజర్వుడు, ట్రాన్స్ పర్ శాఖలుగా విభజించి, ట్రాన్స్ పర్డ్ శాఖల్లోని అంశాలపై భారతీయ మత్రులకు అధికారం కల్పించి వారు రాష్ట్ర శాసనసభకు భాద్యత వహించే ఏర్పాటు చేశారు.


19.ముస్లీంలను వేరుచేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ ను స్పష్టం చేసిన అంశం

(A) ముస్లీంలకు ప్రత్యేక నియోజక వర్గాలను ప్రవేశపెట్టడం

(B) రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లీం వ్యవస్థ

(C) రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లీలను చేర్చుకోకపోవడం

(D) 1935 సమాఖ్య నిభందనలు


SHOW ANSWER

[Ans: a]

Explanation: 1909 లో మింటో-మార్లె సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లీంలకు ప్రత్యేక నియోజక వర్గాలు అనే భావనను ప్రవేశపెట్టారు. ఇది విభజించి పాలించడంలో ఒక భాగం అదే భారతదేశవిభజనకు దారి తీసింది


20.భారతదేశంలో ప్రవేశపెట్టిన ఎ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వాభావం ప్రజాభిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి

(A) 1892

(B) 1909

(C) 1919

(D) 1935


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1909 చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా ఓటుహక్కును ప్రవేశపెట్టారు. పరిమిత ప్రతిపాదికపై ప్రతినిదులను ఎన్నుకునే అవకాశం కల్పించారు.


21.భారతదేశంలో ప్రవేశపెట్టిన ఎ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాభిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి

(A) 1892

(B) 1909

(C) 1919

(D) 1935


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1909 చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా ఓటుహక్కును ప్రవేశపెట్టారు. పరిమిత ప్రతిపాదికపై ప్రతినిదులను ఎన్నుకునే అవకాశం కల్పించారు.


22.భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం

(A) 1909 కౌన్సిల్ చట్టం

(B) 1935 భారతప్రభుత్వ చట్టం

(C) 1919 కౌన్సిల్ చట్టం

(D) 1947 స్వతంత్ర చట్టం


SHOW ANSWER

[Ans: c]

Explanation: కేంద్ర శాసన శాఖను ద్విసభావిధానంగా 1919 కౌన్సిల్ చట్టం ద్వారా ఏర్పాటుచేశారు.


23.మొట్టమొదటిసారిగా కేంద్ర,రాష్ట్రాల మద్య అదికారాలను వేరుచేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం?

(A) 1935 భారత ప్రభుత్వ చట్టం

(B) 1919 భారత కౌన్సిల్ చట్టం

(C) 1909 కౌన్సిల్ చట్టం

(D) 1947 భారత స్వాతంత్ర చట్టం


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1919 చట్టంలో కేంద్ర, రాష్ట్రాల మద్య అదికారాలను విభజన చేశారు.


24.1935 చట్టంలోని ముఖ్యాంశం?

(A) రాష్ట్రాల ఎర్పాటు

(B) వయోజన ఓటుహక్కు

(C) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి

(D) ప్రత్యేక ఓటింగ్


SHOW ANSWER

[Ans: c]

Explanation: రాష్ట్రాల్లో ద్వంద ప్రభుత్వం రద్దు చేసి అన్ని అంశాలపై భారతీయులకు అదికారం కల్పించారు అనగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు.


25.1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విదానంలో మార్పునకు సిఫారసు ఛేసిన కమిటి?

(A) సప్రూ

(B) సైమన్ కమిషన్

(C) బప్లర్ కమిషన్

(D) నెహూనివేదిక


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1928 లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమీషన్ 1919 చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తు ద్వంద్వ పాలనను రద్దు చేయాలని సూచించింది.


26.1935 భారత ప్రభుత్వ చట్టాన్నికోత్త భాండేజ్ చార్టర్ గా వర్ణించింది

(A) M K గాంధీ

(B) సర్థార్ పటేల్

(C) రాజేంద్రప్రసాద్

(D) నెహ్రు


SHOW ANSWER

[Ans: d]

Explanation: ఎలాంటి అధికారాలు భారతీయులకు బదిలీ చేయకూండా బ్రిటీష్ గవర్నర్ జనరల్ కు తిరుగులేని అధికారాలను కల్పించిన 1935 చట్టం నూతన భానిసత్వానికి నాందిగా నెహ్రూ వర్ణించాడు.


27.ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం

(A) 1858

(B) 1861

(C) 1935

(D) 1919


SHOW ANSWER

[Ans: a]

Explanation: 1858 చట్టం ద్వారా విక్టోరియా మహారాణి కంపెనీ పాలనకు స్వస్తి పలికి ప్రత్యక్ష పాలనను స్వీకరించారు. అందుకే ఈ చట్టాన్ని good Governance అంటారు.


28.800 ఎళ్ల చరిత్ర ఉన్న బ్రిటీష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతిపెద్దది?

(A) అమెరికా స్వాతంత్ర చట్టం

(B) భారత స్వాతంత్ర్య చట్టం

(C) 1935 భారత ప్రభుత్వ చట్టం

(D) పైవన్ని


SHOW ANSWER

[Ans: b]



29.గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటి సారిగా ప్రాథినిధ్యం కల్పించిన చట్టం

(A) 1861 కౌన్సిల్ చట్టం

(B) 1892 కౌన్సిల్ చట్టం

(C) 1909 కౌన్సిల్ చట్టం

(D) 1919 కౌన్సిల్ చట్టం


SHOW ANSWER

[Ans: c]


30.గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ జారిచేసే అవకాశాన్ని కల్పించిన చట్టం

(A) 1909

(B) 1919

(C) 1935

(D) 1861


SHOW ANSWER

[Ans: d]

Explanation: 1861 చట్టం ద్వారా శాసన కౌన్సిల్ లసమ్మతి లేకూండానే వైశ్రాయి ఆర్డినెన్సులను జారిచేసే అధికారాన్ని కూడ కల్పించారు.


31.భారతదేశంలో మతప్రాతిపదిక , ప్రాతినిద్య పితామహుడు

(A) లార్డ్ కర్ఫన్

(B) మింటో

(C) హ్యూమ్

(D) విల్లీ


SHOW ANSWER

[Ans: b]

Explanation: మింటో 1909 లో మతప్రాతిపదికన నియోజక వర్గాలు ఏర్పాటు చేశారు. అందువల్ల అతన్ని మత ప్రాతిపదిక పితామహుడు అంటారు.


32.లార్డ్ బిర్కెన్ హుడ్ వ్యాఖ్యకు సమాదానంగా దీనిని పేర్కోటారు.

(A) రౌండ్ టేబుల్ సమావేశాలు

(B) సైమన్ కమీషన్ నివేదిక

(C) నెహ్రు నివేదిక

(D) రాజాజి పార్ముల


SHOW ANSWER

[Ans: c]

Explanation: లార్డ్ బిర్కెన్ హుడ్ ప్రశ్నకు బదులుగా మోతిలాల్ నెహ్రు అధ్యక్షుడిగా ఉపసంఘాన్ని నియమించారు. ఇది తయారుచేసిన రిపోర్ట్ను నెహ్రూరిపోర్ట్ ఆంటారు


33.మహత్మాగాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం?

(A) ఒకటవ రౌండ్ టేబుల్

(B) రెండవ రౌండ్ టేబుల్

(C) మూడవ రౌండ్ టేబుల్

(D) పైవన్ని


SHOW ANSWER

[Ans: b]



34.కమ్యుల్ అవార్డు 1932 అనగా?

(A) ముస్లీంలకు ప్రత్యేక్ష నియోజక గణాలు

(B) సిక్కులు, క్రిష్టియన్లకు ప్రత్యేక గణాలు

(C) షెడ్యూల్డ్ కులాలకు నియోజక గణాలు

(D) పైవన్ని సరైనవే


SHOW ANSWER

[Ans: d]


35."పూనా ఓప్పందం" ఎవరెవరి మద్య జరిగింది 1932

(A) గాంధీ - నెహ్రు

(B) గాంధీ - B R అంభెడ్కర్

(C) నెహ్రు - రాజేంద్రప్రసాద్

(D) పైవేవి కావు


SHOW ANSWER

[Ans: b]

Explanation: కమ్యునల్ అవార్డు 1932 ను వ్యతిరేకిస్తు గాంధీ పూనాలోని ఎర్రవాడ జైలులో 1932 sep 20 న ఆమరణ్ నిరాహార దీక్షకు పూనుకున్నడు. రాజాజి, అండ్కర్, మదన్ మోహన్ మాలవ్య వంటి నాయకుల చొరవతో దీక్షను గాందీ విరమించారు. దాని ఫలితంగా పూనా ఒప్పందం ఏర్పడింది. షెడ్యూల్ కులాలకు కమ్యునల్ అవార్డు కంటె ఎక్కువ సీట్లు కేటాయించారు.


36.రౌండ్ టేబుల్ సమావేశాల గూర్చి సరైనది

(A) 1930 - 1932 వరకు లండన్ లో3 సమావేశాలు జరిగాయి

(B) రౌండ్ టేబుల్ సమావేశాల ఆదారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాం రూపొందించారు

(C) సైమన్ కమీషన్ నివేదిక ఆదారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.

(D) పైవన్ని సరైనవే


SHOW ANSWER

[Ans: d]


37.భారత ప్రభుత్వచట్టం 1935 ప్రకారం కార్యన్మిర్వాహణ అధికారం కలిగి ఉండునది.

(A) బ్రిటిష్ రాణి

(B) కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్

(C) ఇంగ్లాండ్ పార్లమెంట్

(D) సమాఖ్య శాసన సభ


SHOW ANSWER

[Ans: b]

Explanation: 1935 చట్టం ప్రకారం రిజర్వుడు శాఖలను గవర్నర్ జనరల్ తన కార్యనిత్వహణ మండలి సహాయంతో నిర్వహించేవారు. శాసన సభకు భాద్యత వహించాడు


38.1935 భారత ప్రభుత్వ చట్టం విషయంలో సరికానిది.

(A) రాష్ట్రంలో సంపూర్ణ భాద్యతాయుత ప్రభుత్వం

(B) కేంద్రంలో పాక్షిక భాద్యతాయుత ప్రభుత్వం

(C) అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్ కు కల్పించడం

(D) సుప్రీం కోర్టును కలకత్తాలో ఏర్పాటు చేయడం


SHOW ANSWER

[Ans: d]

Explanation: 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 లో ఢిల్లీలో పెడరల్ కోర్టు ఏర్పాటైంది. ఇదే తర్వాత సుప్రీంకోర్టుగా మారింది.


39.రాష్ట్రాలో ద్విసభావిధానం, కేంద్రంలో ద్వంద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఛట్టం

(A) 1919 చట్టం

(B) 1927 సైమన్ కమీషన్

(C) 1935 చట్టం

(D) 1944 నివేదిక


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1935 చట్టం రాష్ట్రంలో ద్వంద ప్రభుత్వం రద్దు దేసి, ద్విసభా విధానం ను ప్రవేశ పెట్టింది, కేంద్రంలో రిజర్వుడ్ ,ట్రాన్స్ ఫర్డ్ శాఖలలో ద్వంద ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినారు.


40.1935 చట్టం "బలమైన బ్రేకులుండి, ఇంజన్ లేని యంత్రం" అని ఎవరన్నారు

(A) గాంధీ

(B) నెహ్రూ

(C) మదన్ మోహన్ మాలవ్య

(D) జిన్నా


SHOW ANSWER

[Ans: b]


41.ప్రత్యక్ష ఎన్నికల విధానం స్త్రీలకు ఓటు హక్కు కల్పించన ఛట్టం?

(A) 1935 చట్టం

(B) 1892 చట్టం

(C) 1919 చట్టం

(D) 1909 చట్టం


SHOW ANSWER

[Ans: c]

Explanation: 1919 చట్టం ప్రత్యక్ష ఎన్నికలతో పాటు స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది



42.లార్డ్ లిన్ లిత్ గో ప్రతి పాధనలకు గల మరొక పేరు

(A) అగస్టు 1940 ప్రతిపాధనలు

(B) సెప్టెంబర్ 1940 ప్రతిపాధనలు

(C) అక్టొబర్ 1940 ప్రతిపాదనలు

(D) ఏదికాదు


SHOW ANSWER

[Ans: a]

Explanation: అప్పటి భారత వైశ్రాయి లార్డ్ లిన్ లిత్ గో 1940 August- 8 తేదీన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అందువల్ల దీన్ని అగస్టు ప్రతిపాదనలు అనికూడా అంటారు.


43.1931 సం. దేనికి ప్రసిద్ది

(A) గాంధీ-ఇర్విన్ ఒడంబడిక

(B) గాంధీ - జిన్నా ఒడంబడిక

(C) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం

(D) A మరియు C


SHOW ANSWER

[Ans: d]

Explanation: 1931 సం|| లో గాంధీ - ఇర్వీన్ ఒడంబడిక ప్రకారం 1931 లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం (లండన్) లో గాంధీ పాల్గొన్నాడు


44.క్రిప్సు ప్రతిపాదనలు 1942 సరైనవి?

(A) భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుంది

(B) క్రిప్సు లేబర్ పార్టీ నాయకుడు

(C) క్రిప్సు రాయబారం విపలనుకోవడం వల్ల క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది

(D) అన్ని సరైనవే


SHOW ANSWER

[Ans: d]


45.వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సం||

(A) 1944

(B) 1945

(C) 1946

(D) 1946


SHOW ANSWER

[Ans: b]

Explanation: లార్డ్ వేవెల్ 1945 లో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించి వేవెల్ ప్రణాళికను ప్రకటించారు.


46.రాజ్యాంగ పరిషత్ 1946 ను ఎవరి సిఫారసుల ప్రకారం ఏర్ఫాటు చేశారు.

(A) వెనెల్ ప్రణాళిక -1945

(B) కాబినెట్ మిషన్ -1946

(C) అట్లీ ప్రకటన

(D) పైవేవి కావు


SHOW ANSWER

[Ans: b]


47.క్యాబినెట్ మిషన్ గూర్చి సరికానిది.

(A) ప్రోనిస్షియల్ గ్రూపింగ్

(B) తాత్కాళిక దేబినెట్

(C) పాకిస్తాన్ ఏర్పాటు

(D) రాజ్యాంగ హక్కును గుర్తింఛడం


SHOW ANSWER

[Ans: c]

Explanation: మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 ప్రకారం పాకిస్తాన్ ఏర్పాటు అయింది


48.జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా తాత్కలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సం.

(A) 1946 sep 2

(B) 1947 aug 15

(C) 1949 nov 26

(D) 1950 jan 26


SHOW ANSWER

[Ans: a]

Explanation: క్యాబినెట్ మిషన్ సిపారసులననుసరించి 1946 sep 2 న తాత్కాళిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


49.ఏవరి సిపారసుల మేరకు 1947 భారత స్వాతంత్య్ర చట్టాన్ని రూపోందించారు?

(A) వెవెల్ ప్రణాళిక

(B) క్రిప్స్ ప్రతిపాదనలు

(C) క్యాబినెట్ మిషన్

(D) మౌంట్ బాటన్ ప్రణాళిక


SHOW ANSWER

[Ans: d]

Explanation: గవర్నర్ జనరల్ మౌంట్ బాతన్ ప్రణాళికననుసరించి 1947 july 4 న భారత స్వాతంత్ర్య ముసాయిదాను బ్రిటిష్ పార్లమేంట్ లో ప్రవేశపెట్టి 1947 july 18 న ఆమోదించి, 1947 aug 14 అర్ధరాత్రి అమలులోనికి వచ్చింది.


•చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK

◆మీకు నచ్చితే పదిమంది మిత్రులకు షేర్ చేయండి


Post a Comment

0 Comments