Header Ads Widget

ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?...ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?

 

ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?...ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?

ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?...ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?


మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్

లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు

పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో

పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని

భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ

ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి

తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను

కలిగినవారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం

ఉంది. ఫోన్ కవర్లో రూపాయి నోట్లను ఉంచడం

ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.



*వేడిని బయటకు విడుదల కానివ్వదు*


ఫోన్ ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే

ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది.

అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు

ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు

విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు

అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోను బిగుతుగా

ఉండే కవర్ను ఉపయోగించకూడదని నిపుణులు

చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా

చేస్తుందని అంటుంటారు.


*నోట్ల రసాయనాలు ప్రాణాంతకం*


కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే

అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు.

ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు

వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు

అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం

ఏర్పడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్

కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని

నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా

ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే

ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు

సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments