Header Ads Widget

CTET notification 2023 in telugu | apply for ctet july 2023 in telugu pdf

 

CTET notification 2023 in telugu | apply for ctet july 2023 in telugu pdf

CTET July 2023 Notification : సీబీఎస్‌ఈ (CBSE) ఏటా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam July 2023) నోటిఫికేషన్‌ విడుదలైంది. జులై నుంచి ఆగస్టు మధ్యలో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో CTET 2023 నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కచ్చితమైన తేదీలను అడ్మిట్‌ కార్డుల్లో పొందుపరచనున్నట్టు పేర్కొంది.


CTET 2023 జులై సెషన్‌కు పరీక్షకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 26 అర్ధరాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.500ల చొప్పున; రెండు పేపర్లకైతే రూ.1200, రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.


దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లో, నేవీ తదితర స్కూల్స్‌లో టీచర్ల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రాథమికంగా సీటెట్ (CTET ) పరీక్ష నిర్వహిస్తుంది. ఏడాదికి రెండుసార్లు Central Teacher Eligibility Test (CTET) నిర్వహిస్తారు. ప్రాథమిక, ఉన్నత తరగతులకు బోధించే వారి కోసం వేర్వేరు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయవచ్చు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. CTET పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు.


ఈ రెండు పరీక్ష పత్రాల్లోనూ 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి ఒక మార్కు వస్తే.. తప్పు సమాధానానికి ఒక మార్కు మైనస్ అవుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను కింద ఇచ్చిన బుక్‌లెట్‌లోనూ లేదా https://ctet.nic.in/

OFFICIAL PDF CTET 2023 FULL DETAILS :


ఈ చిట్కాలతో CTET 2023లో విజయాన్ని పొందండి :

1.ముందుగా అభ్యర్థులు CTET  సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. CTET 2 స్థాయిలలో నిర్వహించబడుతుంది. ఒక పరీక్ష ప్రైమరీ స్థాయికి, మరొకటి అప్పర్ ప్రైమరీ స్థాయికి జరుగుతుంది. ఈ రెండింటి సిలబస్‌లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. మీరు పరీక్ష రాయబోతున్న సిలబస్‌ను పరిశీలించండి.


2.ముందుగా సిలబస్ ప్రకారం మీ స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోండి. ప్రతి సబ్జెక్టుకు కొన్ని గంటలు కేటాయించండి. ప్రతిరోజూ మీ షెడ్యూల్ ప్రకారం అధ్యయనం చేయండి. ఒక్క రోజు కూడా మీ చదువులకు అంతరాయం కలిగించవద్దు. అవసరమైతే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ని ఉపయోగించుకోండి. మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించండి.


3.మీరు పరీక్షకు రెడీ అవుతున్న సమయంలో ప్రిపరేషన్ పై కచ్చితమైన నిర్ణయం తీసుకోండి. దీని కోసం మీరు CTET పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మీరు యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన అనేక వీడియోలను కూడా ఉన్నాయి. మీ ప్రిపరేషన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మెటిరియల్ సిద్ధం చేసుకోండి.

4.మొడల్ పరీక్ష పేపర్లతోపాటు.. మునుపటి కొన్ని సంవత్సరాల పేపర్లు, మాక్ టెస్ట్ సిరీస్‌లను కూడా ఓ సారి పరిశీలించండి. ఈ సమయంలో సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందులో మీరు చేస్తున్న తప్పులను ఓసారి చెక్ చేసుకోండి. అందులో మీరు నిత్యం చేస్తున్న తప్పులను గుర్తించండి. ఆ తర్వాత ఆ తప్పులను సరిద్దుకోండి. దీని కోసం కోచింగ్‌లో చేరాల్సి వస్తే.. కానీ ప్రతిరోజు దాదాపు 5 నుండి 6 గంటల పాటు సొంత ప్రిపరేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి.


Post a Comment

0 Comments