Header Ads Widget

వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు

 ఈ మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. 


    🟢 ఒకసారి శ్రీకృష్ణుడు పాండవ అగ్రజుడు ధర్మరాజుకు వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను వివరించాడు.


👉 శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమస్త పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు.


👉 వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు.

 " శ్రీరామా.... !

°వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. 

అది ఏంతో మంగళకరమైనది. 

ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు ,

 దుఃఖాలు , మాయ పటాపంచలు అవుతాయి. 

దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెపుతాను విను'' అని అన్నాడు.

       

🕉 పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది.

      

 దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.


అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి శమనుడు , ద్యుతిమానుడు , మేధావి , సుకృతి , దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు.


 ◆ వారిలో దుష్టబుద్ధి పరమపాపి , కుమతి , చెడుప్రవర్తన కలిగినవాడు ఆయిన దుష్టబుద్ధి వేశ్యాసాంగత్యం కలిగినవాడై , మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు.

ఇక ప్రాణులను చంపడంలో ,హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. 


★ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. 


👉 ఆ విధంగా దేశబహిష్కరణకు గురి అయిన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను , పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రాణహింస చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. 


ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. 


అది వైశాఖ మాసం , ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషివస్త్రం నుండి ఒక నీటిచుక్క ధృష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపలు నశించాయి.


◆ వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి ముకుళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు. 


అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. “. వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరుపర్వతం అంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది. కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు''అని తెలిపాడు.


👉 °కౌండిన్యఋషి చెప్పిన మాటలను విన్న ధృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు


👉 ఆ వ్రత ఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. 


🟢👉 ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది.


● తీర్థస్నానం , 

● దానం , 

● యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు .


🟢 మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

        

🟢👉 శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి.


Post a Comment

0 Comments