Header Ads Widget

AP Police Constable SI Recruitment 2022 in telugu

 AP Police : నేటి నుంచి ఎస్‌ఐ ఉద్యోగాలకు అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభం.. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

AP Police Constable SI Recruitment 2022 : ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:

•సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్‌ రెండేళ్లు చదివి ఉంటే సరిపోతుంది.

•సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి :

•సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.

•కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1998 జులై 2 తర్వాత, 2004 జులై 1 కంటే ముందు పుట్టినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.

•హోంగార్డులకు రిజర్వేషన్లు

హోంగార్డులకు సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ను 8 నుంచి 15 శాతానికి, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు 10 నుంచి 25 శాతానికి పెంచారు.

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రెండింటిలోనూ మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు

✓సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు :

•దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 డిసెంబరు 14 నుంచి

•దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2023 జనవరి 1 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు

•ప్రాథమిక రాతపరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 ఫిబ్రవరి 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

•పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి 19 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌-2)


✓సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు :

•దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 నవంబరు 30

•దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2022 

డిసెంబరు 28 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు

•ప్రాథమిక రాత పరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 జనవరి 9 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

•పరీక్ష తేదీ: 2023 జనవరి 22

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



Post a Comment

0 Comments