Header Ads Widget

RRB Group c Answer key in telugu : గ్రూప్-సి పరీక్ష 'కీ' విడుదల.. అభ్యంతరాలకు 18 వరకు గడువు

 ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపడానికి రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబరు 14న కీ విడుదల చేయనున్నారు. అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.

RRB Group c Answer key in telugu : గ్రూప్-సి పరీక్ష 'కీ' విడుదల.. అభ్యంతరాలకు 18 వరకు గడువు

రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేయనుంది. అక్టోబరు 14న మధ్యాహ్నం 1 గంట నుంచి ఆన్సర్ కీ అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపడానికి రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబరు 14న కీ విడుదల చేయనున్నారు. అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 19న రాత్రి 11.55 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

గ్రూప్-డి(ఆర్‌ఆర్‌సీ 01/2019) నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 10 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పరీక్ష నిర్వహించింది.

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాల కోసం దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

WEBSITE LINK CLICK HERE 

Post a Comment

0 Comments