Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 15 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 15 |నేటి చరిత్ర|ముఖ్యమైన  సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :
 

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 15 |నేటి చరిత్ర|ముఖ్యమైన  సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.

2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.

2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది.

2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.

జననాలు :

1856: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (మ.1923)

1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962)

1890: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972)

1892: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989)

1900: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)

1909: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987)

1923: నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.

1925: శివరాజు సుబ్బలక్ష్మి, రచయిత్రి, చిత్రకారిణి.

1926: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015).

1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.

1942: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)

1961: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1967: రమ్యకృష్ణ, నటి.

మరణాలు :

1963: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892)

1998: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923)

2015: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928)

పండుగలు , జాతీయ దినాలు :

*ఇంజనీర్ల దినోత్సవము :

భారతదేశం లో, ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15 న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు. ఈయనకు పేరు తెచ్చిన పథకాలలో కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, దానికి ఆనుకొని వున్న బృందావన ఉద్యానవనం, భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూర్ చందనపునూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపన ముఖ్యమైనవి.

*అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం :

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

*ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం :

ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న నిర్వహించబడుతోంది. చర్మ క్యాన్సర్ (లింఫోమా) పై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలోని 52 దేశాలలోని చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించిన 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి.

*సంఛాయక దినోత్సవం


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE

◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇



Post a Comment

0 Comments