Header Ads Widget

చరిత్రలో ఈరోజు... జూన్ 5 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు, చరిత్రలో నేడు,చరిత్రలో ఈరోజు... జూన్ 5 న ఏం జరిగింది?, చరిత్రలో ఈరోజు ముఖ్యమైన సంఘటనలు

చరిత్రలో ఈరోజు జూన్ 5 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.

1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.

1995: "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.

2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

జననాలు :

1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)

1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక.

1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.

1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.

1961: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

1968: మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

1976: రంభ (నటి), తెలుగు సినిమా నటి.

మరణాలు :

1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).

1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).

పండుగలు , జాతీయ దినాలు :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం :

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది.ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇





Post a Comment

0 Comments