Header Ads Widget

వేసవి కాలంలో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతూ ఉంటాయి. ఎందుకు❓| During the summer, dogs stick out their tongues and bark. Why ❓

 జవాబు:వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా... మనుషులు, జంతువులూ దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉండాలి. మనుషుల దేహంలో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది చర్మం. దీనిలోని స్వేద గ్రంథుల ద్వారా చెమట శరీర ఉపరితలంపైకి వస్తుంది. ఆ చెమట ఎప్పటికప్పుడు భాస్పీకరణం (Evaporation) చెంది ఆరిపోవడానికి మన శరీరం నుంచే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అందువల్ల శరీరం చల్లబడుతుంది. కానీ, కుక్కలాంటి జంతువులకు స్వేద గ్రంథులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు. అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావం వల్ల పెరుగుదలకు లోనవుతుంది. అందువల్లే కుక్క అలా నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం (panting) చేస్తుంది. దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.

Post a Comment

0 Comments