Header Ads Widget

SSC GD Notification 2021: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలంటే..

SSC GD Notification 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) దరఖాస్తు ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌,..
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) దరఖాస్తు ప్రక్రియను గురువారం ప్రారంభించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించడానికి మే 10ని చివరి తేదీగా నిర్ణయించారు. గతంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 60,000 ఖాళీలకు గాను 52,50,335 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. కంప్యూటర్‌ ఆధారంగా జరిగే ఈ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్‌ఎస్‌సీ మాక్‌ టెస్ట్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తర్వాతి సెలక్షన్‌ ప్రక్రియకు ఎంపికవుతారు. అనంతరం వివిధ సెంటర్లలో భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి అర్హతతో నిర్వహించే ఈ పరీక్షకు 18 నుంచి 23 ఏళ్ల వయసు వారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ కంప్యూటర్‌ పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.



For more updates about jobs and News join our telegram group click here 




                                                                                                                   
    How to apply watch this full video👇👇 

 

Post a Comment

3 Comments

Hello buddy if you have any doubts feel free to comment