Header Ads Widget

#Jobs#July201

#jobs #july2021

🏦 బ్యాంకుల్లో కొలువుల జాతర


★డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
★5830 క్లరికల్‌ పోస్టులు

 డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి సువర్ణావకాశం. సొంత రాష్ట్రంలో భద్రమైన కొలువు. ఆకర్షణీయమైన జీతభత్యాలు. పదోన్నతులకు అవకాశం. కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక. వీటన్నింటి సమాహారమే ఐబీపీఎస్‌ ప్రకటంచిన బ్యాంక్‌ క్లర్క్‌ పోస్టులు. 5,830 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…*

 *ఐబీపీఎస్‌* 

◆దేశంలోని జాతీయ బ్యాంకుల్లో క్లర్క్‌, ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ వంటి పోస్టులను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహించే సంస్థ.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌). ఏటా వేలాది పోస్టుల భర్తీకి పారదర్శకమైన ప్రక్రియలో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఈ సంస్థ. ప్రస్తుతం క్లరికల్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ) క్లర్క్స్‌-XI నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్‌ విడుదల చేసింది. సీఆర్‌పీ క్లర్క్స్‌ ఖాళీలు 2022-23 సంవత్సరానికి సంబంధించినవి.
 *పోస్టు* : క్లర్క్‌ (క్లరికల్‌ క్యాడర్‌)
 *మొత్తం ఖాళీలు:* 5830 (తెలంగాణ- 263, ఏపీ-263)
 *నోట్‌* : పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 *విద్యార్హ్హతలు* 

◆గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో డిగ్రీలో వచ్చిన పర్సంటేజీ తెలపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమయానికి మార్క్‌షీట్‌/డిగ్రీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.
◆కంప్యూటర్‌ లిటరసీ: కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఆపరేటింగ్‌, వర్కింగ్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. అభ్యర్థులు కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి లేదా హైస్కూల్‌/కాలేజీ స్థాయిలో కంప్యూటర్‌/ఐటీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
◆ *స్థానిక భాష* : పోస్టుల ప్రాధాన్యతా క్రమంలో ఏ రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర/స్థానిక భాష చదవడం/రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

 *వయస్సు* 

◆2021, జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1993, జూలై 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఎక్స్‌సర్వీస్‌మెన్‌, విడోస్‌, డైవోర్స్‌డ్‌ ఉమెన్‌లకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 *ఎంపిక విధానం* 

◆ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

 *ప్రిలిమినరీ ఎగ్జామ్‌* 

◆మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
◆పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
◆దీనిలో ఐబీపీఎస్‌ నిర్ణయించిన కటాఫ్‌ సాధించిన వారిని పోస్టుల సంఖ్యను బట్టి మెయిన్‌ ఎగ్జామ్‌కు అనుమతిస్తారు.

 *మెయిన్‌ ఎగ్జామినేషన్‌* 

◆ఈ పరీక్షలో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
◆మొత్తం 190 ప్రశ్నలు- 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 160 నిమిషాలు.
◆మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు.

 *పార్టిసిపేటివ్‌ బ్యాంకులు* 

◆బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
◆బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
◆బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
◆కెనరా బ్యాంక్‌
◆సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
◆ఇండియన్‌ బ్యాంక్‌
◆ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌
◆పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
◆పంజాబ్‌&సింధ్‌ బ్యాంక్‌
◆యూకో బ్యాంక్‌
◆యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

 *ముఖ్యతేదీలు* 

 *దరఖాస్తు* : ఆన్‌లైన్‌లో
 *చివరితేదీ* : ఆగస్ట్‌ 1
అప్లికేషన్‌ ఫీజు/ఇంటిమేషన్‌ *చార్జీలు* : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మేన్లకు
రూ.175/-, ఇతరులకు రూ.850/-

 *పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌:* 
Click here                                                                                                                                     👇👇👇👇👇👇👇

📌current affairs
📌Job updates
📌Gk

🔰 *ఈ updates కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి* 

Post a Comment

0 Comments