Header Ads Widget

టోక్యో ఒలింపిక్స్: భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను సరికొత్త చరిత్ర, భారత్‌కి తొలి పతకం...

48 కేజీల వుమెన్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి ఛానుకి రజతం...

21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కి ఒలింపిక్ మెడల్...





టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. 

తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.

2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను...


మీరాబాయికి ప్రశంసల వెల్లువ- రాష్ట్రపతి, ప్రధాని ట్వీట్

టోక్యో ఒలిపింక్స్​లో వెండి పతకంతో మెరిసిన మీరాబాయి చానుకు ప్రశంసల వెల్లువ దక్కుతోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు.. పలువురు క్రీడా ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.




టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటిన మీరాబాయి చానుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వెండి పతకం నెగ్గిన ఆమెకు.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌


👉టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం.- ప్రధాని మోదీ


👉ఒలింపిక్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి.- కేంద్రమంత్రి అమిత్ షా


👉టోక్యోలో భారత్‌ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను.- కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు


👉ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్‌ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను.- మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌



👉మీరాబాయి సొంత రాష్ట్రం మణిపూర్​లోని ఆమె ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. చుట్టుపక్కల గ్రామాలవారు ఆమె గెలుపును ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్నారు.

Post a Comment

0 Comments